Monday, December 23, 2024

హరితహారం స్ఫూర్తితోనే గ్రీనరీ అవార్డులు

- Advertisement -
- Advertisement -

ఎంఏయూడి స్పెషల్ సిఎస్, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌కుమార్
హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఒకే రోజు 1.90 లక్షల మొక్కలు, 126 చెట్లను నాటిన హెచ్‌ఎండిఏ

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గ్రీనరీ అవార్డులను సాధించిందని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌ కుమార్ అన్నారు. రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా కొత్వాల్ గూడ ఎకో పార్క్‌కు చేరుకొని దాదాపు 15 అడుగుల ఎత్తైన మర్రిచెట్టును కొత్వాల్‌గూడ ప్రాంగణంలో నాటారు. బాచుపల్లి మల్లంపేట్ రోడ్డు విస్తరణలో 126 మర్రి, రావి జాతులకు సంబంధించిన చెట్లను హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం కొత్వాల్ గూడ ఎకో పార్క్‌లో ట్రాన్స్‌లోకేషన్ చేసింది. దాదాపు 200 మందికి పైగా హెచ్‌ఎండిఏ, హెచ్‌జిసిఎల్ ఉద్యోగులు, సిబ్బంది సోమవారం కొత్వాల్ గూడ ఎకో పార్క్‌లో 15,000 మొక్కలు నాటారు. మహేశ్వరం మండలం పరిధిలోని ఎలిమినేడు ఫారెస్ట్ అర్భన్ ఫారెస్ట్ బ్లాక్‌లో హెచ్‌ఎండిఏ సిబ్బంది సోమవారం 25,000 మొక్కలు నాటారు.

మొబైల్ వాహనాల ద్వారా 1,50,000 మొక్కలు
ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిసర ప్రాంతాలు, జంట నగరాల్లోని 30 కేంద్రాల్లో ఏడుగురు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (ఎఫ్‌ఆర్‌ఓ)లు మొబైల్ వాహనాల ద్వారా 1,50,000 మొక్కలను వృక్ష ప్రసాదం (ఉచిత పంపిణీ) చేశారు. మొత్తంగా సోమవారం ఒక్కరోజున హెచ్‌ఎండిఏ అర్భన్ ఫారెస్ట్ యంత్రాంగం ఆధ్వర్యంలో 1,90,000 మొక్కలు, 126 మర్రిజాతుల చెట్లను నాటి రికార్డు సాధించారు. కొత్వాల్‌గూడ ఎకోపార్క్‌లో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎల్‌ఎన్ రెడ్డి, అర్భన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, హెచ్‌ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, ప్లానింగ్ డైరెక్టర్ శివ శరణప్ప, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ ప్రసూనాంబలతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News