Thursday, January 23, 2025

పచ్చదనం ప్రగతికి సంకేతాలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : పచ్చదనం ప్రగతికి సంకేతాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన తొమ్మిదో విడత హరితోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మొక్కలు నాటారు.

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గారితో పాటు నగర మేయర్ నీరజ, కార్పొరేటర్ లక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు. ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యరహిత వాతవరణాన్ని అందిచాల్సిన భాధ్యత మనందరిపై వుందన్నారు. అదేవిధంగా భావితరాల భవిష్యత్త్ కోసం నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనాన్ని విస్తరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొవాలని అన్నారు.

పెరుగుతున్న భూ తాపాన్ని తగ్గించడానికి,వాతావరణ సమతుల్యతను పాటించడానికి మొక్కలను నాటడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లు,ఏసీపీ, సిఐ కార్యాలయల పరిధిలో పదకొండు వేల రెండు వందల మొక్కలు నాటిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీ గణేష్, ప్రసన్న కుమార్, వెంకటస్వామి, ఆర్ ఐ లు రవి, శ్రీనివాస్, సాంబశివరావు,శ్రీశైలం, సిఐలు చిట్టిబాబు, తుమ్మ గోపి, స్వామి, శ్రీధర్, అంజలి, సత్యనారాయణ, శ్రీహరి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News