Monday, December 23, 2024

తెలంగాణలో పచ్చదనం శోభిల్లుతోంది

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

సదాశివపేట రూరల్: తెలంగాణకు హరితహారంతో రాష్ట్రంలో ఎక్కడ చూసిన గ్రీనరీతో కళకళలాడుతోందని, పచ్చదనం పెంచే అతి పెద్ద మానవ ప్రయత్నం హరితహారం అని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సదాశివపేట మండల పరిధిలోని తంగెడపల్లిలో సర్పంచ్ గాండ్ల సరప్వతీ సిద్దన్న అధ్యక్షతన హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త జీవుల మనుగడకు పర్యావరణాన్ని సంరక్షంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చనదం పెంచాలనే లక్షంతో సిఎం కెసిఆర్ తీసుకు వచ్చిన హరితహారం పథకంతో రాష్ట్రంలో పెనుమార్పులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యాదమ్మ, ఎంపిడిఓ పూజ, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ మడివలయ్య స్వామి, నాయకులు సిద్దన్న, హన్మంత్‌రెడ్డి,సంగమేశ్వర్, సత్యనారాయణ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News