Saturday, November 23, 2024

హరితహారం దేశానికే దిక్సూచి

- Advertisement -
- Advertisement -

కుంటాల : మానవ మనుగడకు అడవులే జీవనాధారమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా హరిత దినోత్సవ కార్యక్రమంలో మండల కేంద్రం కుంటాలతో పాటు దౌనెల్లి అటవీ ప్రాంతంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ముథోల్ నియోజకవర్గ స్థాయి హరితోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ మానవ మనుగడకు అడవులే జీవనాధారమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరం హరిత దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం పథకానికి తొమ్మిదేళ్ల క్రిందట శ్రీకారం చుట్టారన్నారు.

అద్భుతంగా హరితహరం ముందుకు సాగుతుందని తెలిపారు అదే విధంగా రాజ్యసభ సభ్యుడు ఎంపి జోగినిపెల్లి సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ ద్వారా హరితహారంతో ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అడవులను రక్షించాలనే ఉద్దేశ్యంతో అద్భుతంగా చెట్లను నాటాలని పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు 24 శాతం మొక్కలు విస్తీర్ణం ఉంటే 9 సంవత్సరాల కాలంలో 9 శాతం విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొక్కల సంరక్షణకు చర్యలు చేపడుతూ వాటిని బాధ్యతగా పెంచాలని అన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో అడవులు అద్భుతంగా పెరిగాయి. చెట్లతో పచ్చని ఆకులతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంచాలని ప్రభుత్వం ఆదేశించిందని వాటిని ప్రతి ఒక్కరు బాధ్యతగా పెంచాలని అన్నారు.

మొక్క సంరక్షణకు స్థానిక అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కీలకంగా ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు బాధ్యతతో విధులు చేపట్టడంతో అడవులు సస్యశ్యామలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు మొక్కల సంరక్షణకు బాధ్యతగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం అటవీ శాఖ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అడవుల రక్షణకు అధికారులు బాధ్యతగా కృషి చేయాలన్నారు. 27 శాతం మొక్కలు నాటి అడవులను సంరక్షించారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అద్భుతంగా హరితహారానికి శ్రీకారం చుట్టి హరిత ప్రగతిని ముందుకు నడిపస్తున్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో సైతం నిర్మల్ జిల్లాకు హరితహరంలో మంచి ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటాలన్నారు. అందరి సమన్వయంతో పచ్చని తోరణంలా నాటాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులకు మెమోంటోలతో పాటు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఎఫ్‌ఆర్‌వో రమేష్ రాథోడ్, ప్లాయింగ్ స్కాడ్ రమేష్ రావు, ఎంపిడివో దేవెందర్ రెడ్డి,ఎంపివో అబ్దుల్ రహీం, ఎస్‌ఐ హన్మండ్లు, అటవీశాఖ అదికారులు నందయ్య నాయక్, ఇర్ఫానోద్దిన్, రమేష్, ఎఫ్‌బీవో షంషుద్దీన్, హరిలత, కోటేష్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్‌లు సమతా వెంకటేష్, ఎండీ హైమద్, పెద్దకాపు మల్లేష్, లక్ష్మీ రమేష్, దాసరి కిషన్, ఎంపిటిసి దాసరి మధు, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, మార్కెట్ కమిటీ డైరెక్టర్‌లు గైని సాయి, బొంతల పోశెట్టి, స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News