వైరా: ఖమ్మం జిల్లా, వైరా మండల పరిధిలోని సొమవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రీస్‌ఫీల్డ్ బ్రిడ్జి గురువారం ఒక్కసారిగా కూలిపోయింది. కొన్ని రోజుల క్రితం బ్రిడ్జి కోసం గోడలు నిర్మించి వదిలివేశారు. పది రోజుల క్రితం బ్రిడ్జి పైకప్పు నిర్మించేందుకు సెంట్రింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్రిడ్జికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా ఏర్పాటు చేసిన సెంట్రింగ్ స్లాబ్ కుప్పకూలిపోయింది.
దీంతో బ్రిడ్జి కోసం పనిచేస్తున్న నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైరాలోని ఓ ప్రవేట్ అసుపత్రికి తరలించారు. ఇదిలా వుంటే పది రోజుల క్రితం వేసిన సెంట్రింగ్ సరిగ లేకపోవటం వలన, బ్రిడ్జిపై వేసిన సిమెంట్ పరిమాణం ఎక్కువ కావటం వల్లనే ఈ బ్రిడ్జి కూలిపోయి ఉండవచ్చునని స్థ్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బ్రిడ్జి కూలే సమయంలో కార్మికులు క్షణకాలంలో తప్పించుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.