Monday, January 20, 2025

గొల్లగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు

- Advertisement -
- Advertisement -

వేంసూరు : వేంసూరు మండల పరిధిలోని కల్లూరు గూడెం నుండి గొల్లగూడెం మీదుగా వెళ్లే రహదారిలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సూర్యాపేట నుండి జంగారెడ్డిగూడెం దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్.నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో మండలంలోని ప్రజలు రైతులుహర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో రెండు పంటలు పండే రైతుల పంట పొలాలు పోయిన విషయం విధితమే. వేంసూరు మండలంలోని అడసర్ల పాడు, ఎర్ర సానివారి బంజర, కల్లూరు గూడెం వద్ద, గొల్లగూడెం, మీదుగా ఎర్రగుంట, వేంసూరు, భీమవరం, లింగపాలెం, గ్రామాలలోని పంట పొలాలు మీదుగా తుంబూరు, నారాయణపురం, అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ (రహదారి నిర్మాణ పనులు ) వేగం పుంజుకున్నాయి. పంట పొలాలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారంప్రభుత్వం చెల్లించిన విషయం విది తమే. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందనిపలువురు భావిస్తున్నారు. ఎగజిట్ వేంసూరు కేంద్రంగా ఏర్పాటుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కృషి ఫలితం అని చెప్పొచ్చు. ఈ ప్రాంత ప్రజలు, రైతులు తుమ్మలకు రుణపడి ఉంటామని పలువురు వ్యాఖ్యానించటం హర్షణీయం. బేతుపల్లి హైలెవల్ ఛానల్,. తోపాటు మండలంలో కరువు కాటకాలతో అలమటించే రైతుల దయనీయ పరిస్థితి గ్రహించి మండలంలో లిఫ్టులను నిర్మింప చేసి వాటి ద్వారా సాగునీరు మండలానికి అందించడం, చిరస్థాయిగా రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వేంసూర్ ప్రాంతంలోని ఈ నేషనల్ హైవే వలన భూములకు రేట్లు పలికే అవకాశం ఉందని, వేంసూరు మండల కేంద్రానికి మహర్ధశ పట్టిందని చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News