Friday, December 20, 2024

హరితహారం ప్రతిఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -
  • ప్రతివ్యక్తి విధిగా మొక్కలు నాటి సంరక్షించాలి
  • అడవులను పెంచుదాం… ఆరోగ్యంగా జీవిద్దాం
  • విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: భవిష్యత్‌లో భావితరాల ప్రజలకు పర్యావరణపరంగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు అర్బన్‌పారెస్ట్‌లో ఏర్పాటు చేసిన హరితహార కార్యక్రమంలో రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, సిఎ శాంతి కుమారి, చెవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి,జడ్పిచైర్‌పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఉమ్మడిజిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి మొ క్కలు నాటిన అనంతరం బిటిఆర్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం వెల కోట్ల నిధులు ఖర్చుచేసి ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేసి అందులో రకరకాల మొక్కలను పెంచి ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, పల్లెప్రకృతి వనాలలో నాటి సంరక్షిస్తున్నామన్నారు.

వానలు వాపసురావాలి,, కోతులు వాపస్ పోవాలనే కేసిఆర్ నినాదంతో మరీంత ముం దుకు వెళ్తున్నామని రానున్న రోజుల్లో మరిన్ని పండ్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ దశాబ్ధి ఉత్సవాల్లో గత తొమ్మిదెండ్లలో అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి కోనసాగిస్తున్న ఘనత మనకు దక్కిందని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు కోనసాగించడం సాధ్యంకాదనుకున్న వాటి లో ముఖ్యంగా మిషన్ భగిరథ, రైతుబంధు, కళ్యాణలక్ష్మి పథకం, వృద్యాప్య పెంన్షన్లు పెంపు వంటి పథకాలు ఉన్నాయని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ప్రతిసంవత్సరంలాగే ఈ వర్షాకాలంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటే హరితహర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌కుమార్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మల్లేశం, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, సుదీర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, కాలే యాదయ్య, అంజయ్యయాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, తుమ్మలూరు సర్పంచ్ మద్ది సురేఖ కర్ణాకర్‌రెడ్డి, ఎంపిపి రఘుమారెడ్డి, కందుకూరు జడ్పిటిసి బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి స్థానిక నాయకలు అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News