హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకోవడానికి ‘గ్రీన్ కో’ సంస్థ ముందుకొచ్చింది. చైనా నుంచి తెలంగాణ రాష్ట్రానికి 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గ్రీన్ కో సంస్థ దిగుమతి తీసుకుంది. కాన్సంట్రేటర్లు కార్గొ విమానంలో శంషాబాద్ చేరుకున్నాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గ్నీన్ కో ప్రతినిధులు మంత్రి కెటిఆర్ కు అందించారు. మంత్రి కెటిఆర్, సిఎస్ సోమేశ్ కుమార్ గ్రీన్ కో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని కెటిఆర్ చెప్పారు. ఆక్సిజన్, ఔషధాల సరఫరా పెంచాలిన కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్జప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని వివరించారు. తెలంగాణలో కోవిడ్-19 విజృంభిస్తోంది. దీంతో కరోనా కట్టడికి సర్కార్ లాక్‌డౌన్ విధించింది.
Greenko donated 200 oxygen concentrators to TS Govt