ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకటైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని తన అత్యాధునిక తయారీ కేంద్రంలో సెప్టెంబరు 29, 2023 నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించచామని వెల్లడించింది. లామినేట్ యూనిట్ ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు, నాణ్యమైన లామినేట్ షీట్లు, కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో కంపెనీ గణనీయమైన ముందడుగు వేసింది.
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ, సబ్‌స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్‌లామ్ డెకరేటివ్ లామినేట్‌లు, కాంపాక్ట్ లామినేట్‌లు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ క్లాడ్‌లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్లైవుడ్ వరకు విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. తయారీలో నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉపరితల పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మార్కెట్ అవకాశాన్ని వేగవంతం చేస్తూ, దాని వృద్ధికి కొత్త ఆదాయ వనరులను జోడిస్తుంది.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ తయారీ కేంద్రం, ఏడాదికి 3.50 మిలియన్ లామినేట్ షీట్లు, కాంపాక్ట్ బోర్డ్‌లతో ఆకట్టుకునే ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా నెలకొల్పారు. లామినేట్ పరిశ్రమలో శ్రేష్ఠత, ఆవిష్కరణలకు, ప్రాంతం ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు, తన వినియోగదారులకు అత్యుత్తమ-నాణ్యత కలిగిన లామినేట్ ఉత్పత్తులను అందించేందుకు గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ నిబద్ధతకు ఈ తయారీ కేంద్రం ఏర్పాటు నిదర్శనంగా నిలుస్తుంది. ఏకీకృత ప్రాతిపదికన, ఈ తయారీ కేంద్రం పూర్తి వినియోగ సామర్థ్యంతో వార్షిక ఆదాయం రూ.600 కోట్లు గడిస్తుందని అంచనా. ఈ కేంద్రం ఉన్న ప్రాంతంలో జనాభాపరమైన ప్రయోజనంతో మరింత సుసంపన్నం చేయబడింది. దక్షిణ భారతదేశం అతిపెద్ద మార్కెట్ కాగా, పోర్ట్‌కు సమీపంలో ఉండడంతో లాజిస్టిక్‌లను గణనీయంగా క్రమబద్ధీకరించడం, రవాణా సమయాన్ని తగ్గించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లను అందించడంలో సంస్థకు ఉపయుక్తంగా ఉండనుంది.
నూతన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సౌరభ్ మిట్టల్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన మా తయారీ కేంద్రం ప్రారంభాన్ని ప్రకటించుందకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ మహోన్నతమైన సందర్భంలో ఉత్పాదక శ్రేష్ఠతను సాధించడంలో మా అచంచలమైన అంకితభావాన్ని చాటి చెబుతుంది. ప్రపంచ స్థాయి ఉపరితల పరిష్కారాలను అందించడంలో మా నాయకత్వాన్ని పునరుద్ఘాటిస్తుంది’’ అని వివరించారు.
ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించడం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఇది మా తయారీ సామర్థ్యాల గణనీయమైన విస్తరణను సూచిస్తుంది. లామినేట్‌లు, కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం మేము ఇన్‌స్టాల్ చేయబడిన సామర్థ్యం ఏడాదికి 21.02 మిలియన్ల నుంచి 24.52 మిలియన్ లామినేట్ షీట్లు, కాంపాక్ట్ బోర్డ్‌లకు ఏకీకృత ప్రాతిపదికన, నాలుగు వ్యూహాత్మకంగా ఉన్న లామినేట్ ప్లాంట్‌లలో పెంచబడిందని తెలియజేందుకు మేము గర్విస్తున్నాము. సామర్థ్యంలో ఈ గణనీయమైన వృద్ధి మా విలువైన కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌లను పరిష్కరించడంలో మా నిబద్ధతను ప్రదర్శించడమే కాకుండా ప్రపంచ లామినేట్ పరిశ్రమలో ఇప్పటికే బలమైన మా స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది.
వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించే వరకు ప్రాజెక్ట్ కోసం వెచ్చించిన మొత్తం మూలధన వ్యయం (కాపెక్స్) సుమారు రూ.239 కోట్లు. ఈ కొత్త కేంద్రం అత్యాధునిక సాంకేతికతతో, అత్యున్నత పరిశ్రమ ప్రమాణాలకు కట్టుబడి ఉంది. అసమానమైన నాణ్యత కలిగిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విస్తరణతో, మా వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి మేము గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉన్నాము. మా వినియోగదారులకు అత్యధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులతో నిరంతరం ఆవిష్కరణలు, సేవలందించేందుకు మేము వేచి చూస్తున్నాము.