Monday, December 23, 2024

పలకరించిన తొలకరి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో: ఎట్టకేలకే తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. శుక్రవారం జిల్లాలని పలు ప్రాంతాల్లో వర్సాలు పడ్డాయి. వానాకాలం పంటలకోసం ఎదురుచూస్తున్న రైతులు తొలకరి వర్షాలతో ఊపిరిపీల్చుకున్నారు. మృగశిర కార్తె రోజు నుంచే వర్షాల పడ్డాయి. కాని ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో వర్షాలజాడలేకుండా పోయింది. ప్రతికూల పరిస్థితులు అధిగమించి యాసంగి వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్న రైతులు వానాకాలం పంటలు సాగుమీదే ఆశపెట్టుకున్నారు.

అకాల వర్షాలతో ఈ యాసంగి పంటను కోల్పోయిన రైతులు వానా కాలం పంటలైనా సకాలంలో వేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతర విద్యుత్‌కు తోడు భూగర్భ జలాలు సైతం పుష్కలంగా ఉన్నప్పటికీ తొలకరి వర్షంతో పుడమితల్లి తడిస్తేనే దిగుబడి బాగా వస్తుందని రైతుల నమ్మకం. అందుకే వానాకాలంకు సంబందించి సాగు పనులు పదిరోజుల ముందే మొదలు పెట్టారు. కాని ఈసారి మిరుగు అయి 15 రోజులైనా వర్షాల జాడ లేకపోవడంతో రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. ఆలస్యంగానైనా రుతుపవనాలు రావడంతో వాతావరణంలో అనూహ్యమార్పులు వచ్చాయి. శుక్రవారనం ఉదయం నుంచే జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News