Monday, December 23, 2024

ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడింది: చిరు

- Advertisement -
- Advertisement -

Greetings card for industry problems

అమరావతి: ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరు మీడియాతో మాట్లాడారు. ఎపిలో చిన్న సినిమాలకు ఐదో షోకు అంగీకారం తెలిపారన్నారు. సిఎం జగన్‌తో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు.  టికెట్ ధరలపై కొన్ని నెలలుగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. చర్చలకు మమ్మల్ని ఆహ్వానించిన సిఎం జగన్‌కు సినీ పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలిపారు. అటు ప్రజలు, ఇటు ఇండస్ట్రీ కోసం సిఎం జగన్ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని సంతృప్తి పరిచిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News