Sunday, December 22, 2024

శ్రీనగర్‌లో సంతపై గ్రనేడ్ దాడి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌లో జనంతో కిక్కిరిసిన ఆదివారం సంతలో గుర్తు తెలియని ఉగ్రవాదులు ఒక గ్రనేడ్ విసిరిన ఘటనలో కనీసం పది మంది వ్యక్తులు గాయపడ్డారు. గట్టి బందోబస్తు ఉన్న టూరిస్ట్ రిసెప్షన్ కేంద్రం సమీపంలో ఈ దాడి జరిగింది. నగరంలో ఉగ్ర మూక లష్కర్ ఎ తయ్యిబా (ఎల్‌ఇటి) టాప్ కమాండర్ ఒకరిని భద్రత బలగాలు హతమార్చిన మరునాడు ఈ ఉగ్ర దాడి చోటు చేసుకున్నది. గ్రనేడ్ పేలుడుతో దుకాణదారులు రక్షణ కోసం పరుగులు తీశారు. దీనితో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రనేడ్ విస్ఫోటంలో గాయపడినవారు అంతా స్థానికులే. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు.

పేలుడు అనంతరం వైద్య బృందాలతో పాటు భద్రత బలగాలు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లాయి. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం వెంటనే గాలింపు మొదలైంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆ దాడిని గర్హించారు. అమాయక పౌరులను లక్షం చేసుకోవడం సమర్థనీయం కాదని అబ్దుల్లా అన్నారు. అనేక సంవత్సరాలు కాశ్మీర్ లోయలో చురుకుగా ఉన్న లష్కర్ కమాండర్ ఉస్మాన్‌ను భద్రత దళాలు శనివారం కాల్చిచంపాయి. ఉస్మాన్‌కు ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వనీ హత్యలో ప్రమేయం ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News