Thursday, January 23, 2025

గ్రేహౌండ్స్ గురువుకు నివాళి.. డిజిపి అంజనీ కుమార్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రే హౌండ్స్ గురువు ఎన్‌ఎస్ భాటి వర్థంతి సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ ట్విట్టర్ వేదికగా నివాళుల ర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దేశంలో నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులకు మరింత మెరుగైన శిక్షణ నైపుణ్యం కలిగిన ఆఫీసర్లను తయారుచేసుకొని నక్సల్స్‌ను ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. అయితే అందరికీ గ్రేహౌండ్స్ అంటే కేఎస్ వ్యాస్ గుర్తుకు వస్తారు. కానీ ఎన్‌ఎస్ భాటి అనే వ్యక్తి గురించి పోలీసులకు తప్ప బయటి వారికి అంతగా తెలియదు. కానీ పోలీసులను యుద్ధ నిపుణులుగా తయారుచేసిన గొప్ప శిక్షకుడు.

ఎస్‌ఎస్‌బీలో డిఐజిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో వ్యాస్ సర్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ వచ్చి గ్రేహౌండ్స్ స్థాపించినప్పుడు దానిలో పోలీసులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. గెరిల్లా యుద్ధతంత్రాలు ఈయన నుండే నేర్చుకున్నారు. దట్టమైన అడవుల్లో నదీతీరాల్లో కొండల్లో కోనల్లో ఎండకు వానకు చలికి ఏలాంటి విపత్కర పరిస్థితుల్లో అయిన పోరాడే విధంగా యుద్ధతంత్రాలన్నింటినీ మన పోలీసులకు బోధించి ఒక్కొక్క పోలీసును తుపాకీ తూటాల్లా తయారు చేసిన వ్యక్తి ఎన్‌ఎస్ భాటి(నారయణ్ సింగ్ భాటి). అడవుల్లో వేసుకునే దుస్తులు తినే ఆహారరీతులతో పోలీసు ఎలా బతకాలనే అంశాల నుండి తూటాలు పక్క నుండి పోతున్నా వాటి నుండి తప్పించుకుంటూ శత్రువులను ఎలా చీల్చి చెండాలనే నైపుణ్యాల వరకుప్రతి పోలీసుకు నేర్పించి వారిని మెరికల్లా తయారుచేసిన గురువు ఎన్‌ఎస్ భాటి. ఈయుద్ధ నిపుణుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ఈయన తన 94వ ఏటా పరమపదించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు నేటి శాంతియుత ప్రజాజీవితాన్ని అనుభవిస్తున్నందుకు ఈయనకు సదా కృతజ్ఞులై ఉండవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెయియజేయడానికి సందేహించడం లేదు అని ఐపీఎస్ అధికారి గిరిధర రావుల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News