Sunday, December 22, 2024

రుణమాఫీకి గ్రీవెన్స్ సెల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి సబంధించి బ్యాంకుల ద్వారా పంటరుణాలు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గ్రీవన్స్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. రైతుల్లో ఇప్పటివరకూ 18.79లక్షల మందికి రుణాలు మాఫీ అయ్యాయని ఇందుకోసం రూ.9654కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. రైతు రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సిఎస్ శాంతి కుమారి, స్పెషల్ సిఎస్ రామకృష్ణరావు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్న ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే , ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. రుణమాఫీ డబ్బు ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ,ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు ఋణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యతా క్రమంలో రుణమాఫీ జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందిదని తెలిపారు.

17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయన్నారు. సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదని , వీరికి వెంటనే అందజేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు పనిచేయక పోవడం, అకౌంట్లను క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లను మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు అధికారులు మంత్రికి వివరించగా, ఈ సమస్యలపైన చర్చించిన అనంతరం మూడు పరిష్కార మార్గాలు గుర్తించారు. వీటిలో ఆధార్ నం బర్ల సాయంతో రైతు బంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణ మాఫీ డబ్బు వేయడం, దీని వల్ల సుమారు మరో లక్ష మందికి రుణ మాఫీ డబ్బు అందుతుంది.

ఎన్‌పిసిఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థిక శాఖ నిధులు విడుద ల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూ డు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా 16వేల మంది వివరాలను కలెక్ట ర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యం లో క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రా ష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. జిల్లాస్థాయిలో ఒక అధికారిని నియమించి, వారి ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలి. రైతు లు ముందుగా బ్యాంకు స్థాయిలో సంప్రదిస్తారు. అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలి. ఇదే తరహాలో వ్యవసాయ శాఖ తరుపు న జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తాం.. అని మంత్రి హరీష్ రావు వివరించారు.

రుణ మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణా లు మంజూరు చేయాలని, పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు స మీక్షలు జరపాలన్నారు. రుణమాఫీ పొందిన వారి లో ఇప్పటి వరకు 35 శాతం మందికి మ్రాతమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెప్తున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18. 79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యువల్ పూర్తి కావాలని ఆదేశించారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు.కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యువల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మం త్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణ మాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబధిత అన్ని సమస్యలు సత్వరం పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News