నిర్వహించన సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరోః గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో డిసిపిలతో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు 13 గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై సిబ్బంది త్వరగా స్పందించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. పెండింగ్‌ఫైల్స్‌ను త్వరగా క్లియర్ చేయాలని కోరారు. హెచ్‌ఆర్‌ఎంఎస్, సినిమాటోగ్రఫీ పర్మిషన్లు, ఈవెంట్ పర్మిషన్లు, పెట్రోలియం పర్మిషన్లు తదితర అంశాలపై చర్చించారు. హెచ్‌ఆర్‌ఎంఎస్ అప్లికేషన్ల వినియోగంపై సిబ్బందికి అవగాహన పెంచాలన్నారు. సిఎఓలు, సెక్షన్ సూపరింటెండెంట్‌లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సిబ్బందికి సమస్యలుంటే గ్రీవెన్స్ సెల్ 83339 93272కు ఫోన్ చేయాలని కోరారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్, కల్మేశ్వర్, అనసూయ, జగదీశ్వర్ రెడ్డి, శిల్పవల్లి, సందీప్, ఎడిసిపి ఎండి రియాజ్ ఉల్‌హక్, సిఎస్‌డబ్లూ ఎడిసిపి వెంకట్‌రెడ్డి, ఎస్బి ఎడిసిపి రవికుమార్, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.