Thursday, January 23, 2025

బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్షమని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్దం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 21 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ డేలో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపార. భూ సమస్యల విషయంలో అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ చేసి, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని అందుకు అనుగుణంగా బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News