Saturday, December 21, 2024

బడ్జెట్లో గృహలక్ష్మి ప్రస్తావనే లేదు : అర్వింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బడ్జెట్ లో గృహలక్ష్మి పథకానికి రూపాయి కూడా కేటాయించ లేదని.. బడ్జెట్ పత్రాలను మంత్రుల కంటే తానే పూర్తిగా చదివానని.. ఆ పథకానికి నిధులు ఉంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిజామాబాద్‌లో పోటీ చేయాలని.. అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానని అన్నారు. నిజామాబాద్‌లో మంత్రి కెటిఆర్ మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చారని మండిపడ్డారు. గృహలక్ష్మి పథకం దరఖాస్తులకు మూడు రోజులు గడువు ఇచ్చి.. మద్యం టెండర్లకు మాత్రం 15 రోజుల ఇచ్చారని ధ్వజత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News