Sunday, February 23, 2025

కిరాణ షాపులో చోరీ

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: మండల కేంద్రంలోని సిద్దేశ్వర దే వాలయం ఎదురుగా ఉన్న మౌనికారెడ్డి కిరాణంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ప్రతి రోజు మాదిరిగానే శనివారం ఉదయం మౌనికారెడ్డి షాపు తీయగా వెనుక వైపు ఉన్న తలుపు తీసి అందులో ఉన్న వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏఎస్సై లక్ష్మణమూర్తి పరిశీలించారు. మెయిన్ రోడ్డుపై ఉన్న షాపులోనే చోరీకి దొంగలు ప్రయత్నించగా మళ్లీ ఇతర షాపుల్లో సైతం దొంగతలు జరిగే అవకాశం ఉంటుందే మోనని పలువురు షాపు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో సైతం పోలీసులు పెట్రో లింగ్ నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా ఉంటాయని వ్యాపారులు, గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News