Sunday, December 22, 2024

ఘనంగా పెళ్లి…. మూడు ముళ్లు వేస్తుండగా వరుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: పెళ్లి మండపానికి బంధువులు అందరూ చేరుకున్నారు. వివాహం ఘనంగా జరుగుతోంది.. మరి కొన్ని క్షణాల్లో ఆ జంట ఒకటి కాబోతున్న సమయంలో పోలీసులు మండపంలోకి ఎంట్రీ ఇచ్చి వరుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఒడిశా రాష్ట్రం బారగఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఢెంకానాల్ గ్రామానికి చెందిన అజిత్ కుమార్ బోయ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రవాణా సంస్థలో జూనియర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో యువతితో అజిత్‌కు పెళ్లి నిశ్చయం కావడంతో ఘనంగా చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కుమారుడు, కుమార్తె పెళ్లి మండపానికి చేరుకున్నారు. మూడు ముళ్లు వేసే సమయానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి వరుడిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉన్న బంధువులు షాక్ గురయ్యారు. గతంలో అజిత్ మరో యువతితో ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాటిచ్చాడు. మరో యువతితో అజిత్ పెళ్లి చేసుకుంటున్నాడని విషయం తెలియడంతో అతడి ప్రియురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే అజిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:  ప్రియురాలి కుమారుడిని వేడి నీళ్లలో ముంచి… హత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News