Monday, January 20, 2025

జైలుకెళ్లిన పెళ్లికొడుకు!

- Advertisement -
- Advertisement -

హాయిగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవలసిన పెళ్లి కొడుకు దురాశకు పోయి జైలుపాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని ఖానాపూర్ లో జరిగింది. హిండల్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని సచిన్ పాటిల్ కు ఖానాపూర్ గ్రామంలోని ఒక యువతితో పెళ్లి కుదిరింది. వివాహ సమయంలో 50 గ్రాముల బంగారం, లక్ష రూపాయలు కట్నంగా ఇస్తామని పెళ్లికూతురు తరఫువారు అంగీకరించారు. పెళ్లికూతురు తరపు పెద్దలు బెళగావిలోని లోకమాన్య చౌల్ట్రీని అద్దెకు తీసుకుని ఏర్పాట్లు చేశారు.

పెళ్లి తేదీ దగ్గర పడుతుండగా, పెళ్లికొడుకు కట్నం చాలదంటూ పేచీ మొదలుపెట్టాడు. యాభై గ్రాముల బంగారం, లక్ష రూపాయల కట్నం చాలదనీ, వంద గ్రాముల బంగారం, పది లక్షల నగదు ఇస్తేనే తాళి కడతాననీ భీష్మించుకు కూర్చున్నాడు. దాంతో అమ్మాయి తరఫువారు చేతులెత్తేశారు. ముందు కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లికొడుకు ఒప్పుకోకపోవడంతో అమ్మాయి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి, పెళ్లికొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News