Tuesday, December 3, 2024

వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు (వీడియో)

- Advertisement -
- Advertisement -

పెళ్లి పీటలమీద వధువు కాళ్లకు నమస్కరించి అందరినీ షాక్ కు గురి చేశాడొక వరుడు! అస్సాంలోని గువాహతిలో ఈ సంఘటన జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వరుడు పెళ్లికూతురు మెడలో తాళి కట్టాడు. అనంతరం పెళ్లికూతురు లేచి పెళ్లికొడుకు కాళ్లకు నమస్కరించింది. ఆ వెంటనే పెళ్లి కొడుకు కూడా పెళ్లి కూతురు పాదాలను తాకి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్క క్షణం షాక్ కు గురైనా, ఆ తర్వాత తేరుకుని చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెళ్లికొడుకుని విమర్శించగా, ఎక్కువమంది మాత్రం అతను చేసిన పని సరైనదేనని ప్రశంసిస్తున్నారు. ఆడవారైనా, మగవారైనా అంతా సమానమేననీ, వరుడు చేసిన పని ముమ్మాటికీ కరెక్టేననీ మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియోను పెళ్లికొడుకు కల్లోల దాస్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. తాను చేసిన పనిని అతను సమర్ధించుకున్నాడు. తన భార్యంటే తనకు ఎంతో గౌరవమనీ, అందుకే ఆమె కాళ్లకు నమస్కరించాననీ చెప్పాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News