Sunday, December 22, 2024

ఇంటర్ పరీక్షలో ఫెయిల్….. వధువుతో పెళ్లి క్యాన్సిల్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: సరిగ్గా చదువుకోకపోతే పెళ్లి చేసి పంపించేస్తాను అంటూ తమ కుమార్తెలను బెదిరించే తల్లిదండ్రులను చూస్తుంటాము. అయితే..తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంటర్ సెకండియర్ పరీక్షలో ఫెయిల్ అయిందన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకున్న ఒక వరుడిని ఉత్తర్ ప్రదేశ్‌లో చూస్తున్నాము. మన్నోజ్ జిల్లాలో ఈ విచిత్ర సంఘటన ఇటీవల చోటుచేసుకుంది.
అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో పెళ్లికి ముహూర్తం కూడా ఇరువైపులా పెద్దలు నిర్ణయించారు.

ఇంతలో అమ్మాయి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల రిజల్ట్ వచ్చాయి. పరీక్షల్లో అమ్మాయి ఫెయిల్ కావడంతో అబ్బాయి మనస్థాపం చెందాడు. ఆమెను పెళ్లి చేసుకోనంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కాని..అసలు కథ వేరే ఉందని వధువు తల్లిదండ్రులు అంటున్నారు. కట్నం చాలలేదన్న కారణంతోనే అబ్బాయి కుంటిసాకులు చెబుతున్నాడని వారు అంటున్నారు. అబ్బాయికి రూ. 60 వేల కట్నం ఇచ్చామని, మరో రూ.15 వేల విలువైన బంగారు ఉంగరం కూడా ఇచ్చామని వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరింత కట్నం లాగాలనే సాకుతోనే వరుడు ఈ నాటకాలు ఆడుతున్నాడని ఆయన అంటున్నాడు. ఇరుపక్షాల పెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News