Sunday, January 19, 2025

పెళ్లయిన రెండు రోజులకే గొంతు కోసుకొని వరుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: పెళ్లి జరిగిన రెండు రోజులకే నవ వరుడు గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుణ్యపురం గ్రామానికి చెందిన కమ్మం పాటి నరేష్ (29), ఎపికు చెంది ఓ యువతితో జూన్ 4న వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో అందరితో సంతోషంగా ఉన్నాడు. బరాత్‌లో అందరితో కలిసి డ్యాన్స్ చేశాడు. బంధువులతో కలిసి విజయవాడలోని గుణదలలోని ఓ దేవాలయానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. నరేష్ అద్దె కారు కూడా మాట్లాడాడు. సోమవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులను త్వరగా రెడీ కావాలని అందరికి సూచించాడు. తాను బాత్రూమ్‌లోకి వెళ్లాడు. బాత్రూమ్‌లోకి వెళ్లిన నరేష్ బయటకు రాకపోవడంతో బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు. రక్తపు మడుగులో కనిపించాడు. చేయి, గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. నరేష్ కుటుంబ సభ్యుల శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News