Friday, January 31, 2025

బట్టతలను దాచి రెండో పెళ్లి…. చితకబాదిన వధువు కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

పాట్నా: బట్టతలను దాచి రెండో పెళ్లి చేసుకుంటున్న వ్యక్తిని చితకబాదిన సంఘటన బిహార్ రాష్ట్రం గయా జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి మొదటి పెళ్లి జరిగిన విషయాన్ని దాచి రెండో పెళ్లి కోసం తయారయ్యాడు. పెళ్లి వేడుక జరుగుతుండగా ఎవరో దూరపు బంధువులు వధువు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అతడిని నిలదీశారు. అతడు నీళ్లు నమలడంతో పట్టుకొని చితకబాదారు. దీంతో విగ్గు విషయం బయటపడింది. ఈ తంతు జరుగుతుండగా మొదటి భార్య సీన్‌లోకి ప్రవేశించడంతో తన వదిలివేయాలని ప్రాధేయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామ పెద్దలు, కుల పెద్దలు పంచాయతీ పెట్టి అతడికి జరిమానా విధించినట్లు సమాచారం.

Also Read: బ్యాలట్ బాక్సుతో పరుగో పరుగు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News