Thursday, January 23, 2025

మూడు గంటలలో పెళ్లి….. వరుడు మృతి

- Advertisement -
- Advertisement -

Road accidents due to alcohol intoxication

 

జడ్చర్ల: పెళ్లికి మూడు గంటల ముందు వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిష్టయన్ పల్లికి చెందిన భువనాల చైతన్య కుమార్(35) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వనపర్తి జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకు వనపర్తిలో వివాహం జరగనుంది. పెళ్లి కుమారుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎనిమిది గంటల ప్రాంతంలో జడ్చర్లకు బయలు దేరాడు. మార్గ మధ్యంలో కారు చెట్టుకు ఢీకొనడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. సిఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News