Thursday, January 9, 2025

పెళ్లికి గిఫ్ట్‌గా వచ్చిన హోమ్ థియేటర్ పేలి వరుడితో సహా ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: పెళ్లికి గిఫ్ట్‌గా వచ్చిన హోమ్ థియేటర్ పేలి వరుడితో సహా మరొకరు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ జిల్లా కబిర్దమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మారావి, అంజన గ్రామానికి చెందిన యువతిని రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హోమ్ థియోటర్ గిఫ్ట్‌గా వచ్చింది. పెళ్లి కుమారుడు, తన సోదరుడితో కలిసి  ప్లగ్ పెట్టి స్విచ్ఛ్ ఆన్ చేయగానే హోమ్ థియేటర్ పేలి పోయింది.

వరుడు, సోదరుడు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ధాటికి పైకప్పు కూడా సగ భాగం కూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు కబిర్ధమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నక్సల్స్ జోన్ కావునా ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News