Friday, January 3, 2025

పెళ్లి పీటలపై వరుడు మృతి… మరో యువకుడితో పెళ్లి

- Advertisement -
- Advertisement -

Social Media Poll on love and Arranged Marriage  

అమరావతి:  కాసేపట్లో పెళ్లి… ఇంతలోనే వరుడు గుండె పోటుతో మృతి చెందడంతో వధువును మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హోళిగంద మండలం గజ్జహల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గజ్జహల్లి గ్రామానికి చెందిన యువతి, చిన్నతంబళం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు బంధువులను పిలుచుకున్నారు. పెళ్లి జరుగుతున్న సమయంలో వరుడికి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వరుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయి ఉంటాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వధువు తల్లిదండ్రులు వెంటనే తన దగ్గరి బంధువైన వందవాగిలి గ్రామానికి చెందిన నబి రసూల్ తో పెళ్లి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News