Monday, December 23, 2024

చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం…. నవ వరుడు మృతి

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Visakhapatnam

యాద్రాద్రిభువనగిరి: రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చెందిన వీరభద్రం(26) అనాజీపురం గ్రామానికి చెందిన ప్రణీతను ఈ నెల 21న పెళ్లి చేసుకున్నాడు. దంపతులు ఇద్దరు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. పెళ్లి జరిగిన తరువాత విధులకు హాజరు కావాల్సి ఉండడంతో ఇద్దరు కలిసి బైక్‌పై బయలుదేరారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో రోడ్డుపై ఉన్న బోర్డును ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరభద్రం చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రణీత మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. దంపతుల కుటుంబ సభ్యలు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News