Monday, December 23, 2024

శోభనం రాత్రే వరుడు మృతి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: శోభనం రాత్రి వరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రెండు రోజుల క్రితం యువకుడు, యువతికి పెళ్లి జరిగింది. పెళ్లైన రెండో రోజు అత్తగారింట్లో బుధవారం రాత్రి శోభనం ఏర్పాటు చేశారు. అర్థరాత్రి సమయంలో వరుడు తులసీ ప్రసాద్ పడిపోవడంతో వెంటనే వధువు కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయారని నిర్దారించారు. గుండెపోటుతో చనిపోయి ఉంటాడని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పది మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News