Saturday, April 26, 2025

అలిపిరి మెట్లదారిలో తిరుమలకు వెళ్తుండగా గుండెపోటుతో నవవరుడి మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: శ్రీవారి దర్శనానికి అలిపి మెట్లదారిలో వెళ్తుండగా నవవరుడు గుండెపోటుతో దుర్మరణం చెందాడు. తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి చెందిన నవీన్(32) అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నవీన్ పదిహేను రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం భార్య, తన తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వచ్చాడు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలగుట్టపైకి వెళ్తుండగా 2350వ మెట్టు వద్ద నవీన్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News