- Advertisement -
హైదరాబాద్: వివాహానికి కొద్ది గంటల ముందు పెళ్లికొడుకు పరారైన ఘటనా కర్ణాటక రాష్ట్రం కొళ్లేగాలలోని శంకనపుర లేఅవుట్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. బెంగళూరులో మహేష్ కు దివ్యకి ఐదు సంవత్సరాల క్రితం పరిచమయ్యారు. ఇద్దరు ఒకే కంపెనీలో పని చేసేవారు. దీంతో వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహాం చేసుకొవాలనుకున్నారు. సోమవారం ముహుర్తం ఉండగా, మహేష్ సోమవారం ఉదయమే ఇంటిని పారిపోయాడు. దీంతో దివ్య సాయంత్రం వరకు మహేష్ కోసం వెతికి మాంబల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -