Friday, November 22, 2024

ప్రేయసికి పెళ్లి నిశ్చయం… కాబోయే భర్త కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

Groom kidnap by brides lover in Hyderabad

హైదరాబాద్: ప్రేయసికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆమె లవర్ కాబోయే పెళ్లి కుమారుడిని కిడ్నాప్ చేసిన సంఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లిలో జరిగింది. అమ్మాయి, అబ్బాయి తరుపు బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మైలార్‌దేవుపల్లిలోని కింగ్స్ కాలనీకి చెందిన నదీమ్ ఖాన్(28)కు ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చితార్థమైంది. అమ్మాయికి గత కొన్ని రోజుల నుంచి ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. పెళ్లి నిశ్చయం కావడంతో ఆమె లవర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. నదీమ్ ఖాన్(28) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో కిడ్నాప్ చేశారు వాళ్ల ప్రేమ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమె పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కిడ్నాప్ గురించి అమ్మాయికి ముందుగానే సమాచారం తెలుసా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News