Wednesday, January 22, 2025

పెళ్లిలో ముద్దు తెచ్చిన తంటా…. వరుడి బంధువులపై దాడి

- Advertisement -
- Advertisement -

లక్నో: వివాహం జరుగుతుండగా వధువుకు వరుడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడంతో బంధువులు పెళ్లికుమారుడు, ఆయన కుటుంబ సభ్యులను చితక బాదిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల పెళ్లి ఒకే రోజు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. హాపూర్‌లోని అశోక్ నగర్‌లో ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు కూతుళ్ల పెళ్లిలు జరుగుతున్నాయి. పెద్ద కుమార్తె పెళ్లి జరిగిన తరువాత రెండో కుమార్తె పెళ్లి ప్రారంభమైంది. వరమాల వేసిన తరువాత వధువును వరుడు బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులను వరుడి, ఆయను బంధువులపై దాడి చేశారు. ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో పెళ్లి మండపం రణరంగంగా మారింది. ఏడుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడి చేసిన ఆరుగురిని అరెస్ట చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News