Sunday, December 22, 2024

ము..ము… ముద్దంటే చేదే; పెళ్లిపీటలమీద వరుణ్ని వారించిన వధువు (వీడియో)

- Advertisement -
- Advertisement -

పెళ్లి తంతు ముగిసింది. వధూవరులు ఇద్దరూ లేచి దండలు మార్చుకుంటున్నారు. అంతలో అందమైన తన భార్యకు ముద్దు పెట్టాలనుకున్నాడు వరుడు. అదే విషయాన్ని ఆమె చెవిలో చెప్పాడు. పెళ్లయిపోయింది కాబట్టి, ఒప్పుకుంటుందిలే అనుకున్నాడు. కానీ అందరిలో అలా ముద్దు పెడతాననేసరికి, ఆ వధువు వద్దంది. అయినా సరే ముద్దు పెడతానంటూ వరుడు ముందుకు వచ్చేసరికి, ఆమె తల తిప్పుకుంది. ఇలా ఒకటి రెండుసార్లు జరిగాక, పోనీలే పాపం అనుకుందో ఏమో ఆమె తన బుగ్గపై ముద్దు పెట్టనిచ్చింది. ఈ సరదా వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే కొందరు నెటిజన్లు పెళ్లి కొడుకు వైఖరిని తప్పు పట్టారు. అతని ప్రవర్తన ఓవర్ గా ఉందని ఒకరంటే, ఇది మన సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని ఇంకొకరు వ్యాఖ్యానించారు. పాశ్చ్యాత్య కల్చర్ మన సంస్కృతిని పాడు చేస్తోందని మరొకరు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News