Wednesday, April 23, 2025

పెళ్లి చేసుకున్న 15 రోజులకే ముగ్గురు పిల్లలు ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: పెళ్లి చేసుకున్న 15 రోజులకే ముగ్గురు పిల్లలు ఉన్న హెడ్ కానిస్టేబుల్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హాపుడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గజల్‌పుర్ గ్రామానికి చెందిన నవీన్, బాబుగఢ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ఫిబ్రవరి 16న పెళ్లి చేసుకున్నాడు.

వివాహం జరిగిన మూడు రోజులకే ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్ నిర్మలతో నవీన్‌కు అక్రమ సంబంధం ఉన్నట్టు పెళ్లి కూతురుకు తెలిసింది. మార్చి 1న ముగ్గురు పిల్లలు ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ను నవీన్ పెళ్లి చేసుకున్నాడు. నిర్మలతో కలిసి ఉండాలని మొదటి భార్యపై నవీన్ ఒత్తిడి తీసుకరావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఏప్రిల్ 17న ఫిర్యాదు చేసింది. పోలీసుల కేసు నమోదు చేసి నిర్మలను హఫీజ్‌పుర పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేశారు. ప్రస్తుతం నిర్మల, నవీన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News