- Advertisement -
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ లో వరుడు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సిన వరుడు అదృశ్యమయ్యాడు. కెపిహెచ్ బి కాలనీలో నివాసం ఉంటున్న సత్యనారాయణ గుప్తా ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఈ నెల 15న వివాహం జరగాల్సి ఉంది. అయితే, 13వ తేదీన రాత్రి కెపిహెచ్ బి కాలనీలో బస్సు దిగినట్లు గుర్తించిన బంధువులు.. ఆ తర్వాత ఆచూకి లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోసులు దర్యాప్తు చేపట్టారు.
Groom Missing at SR Nagar in Hyderabad
- Advertisement -