Monday, December 23, 2024

పెళ్లైన పది రోజులకే నవ వధువు, అత్తను హత్య చేసిన వరుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వివాహం జరిగిన పది రోజుల వ్యవధిలోనే భార్య, అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చింతల్ మునినగర్‌కు చెందిన శ్రావణ్ అనే యువకుడు, తెలంగాణలోని వనపర్తికి చెందిన కృష్ణవేణి(23)తో ఫిబ్రవరి 1న పెళ్లి జరిగింది. తన కూతురును ఇంటికి తీసుకెళ్లడానికి అల్లుడు ఇంటికి శ్రావన్ అత్త రమాదేవి, మామ ప్రసాద్ వచ్చారు. అల్లుడితో అత్తింటి వారు గొడవకు దిగారు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో శ్రావణ్ తన తండ్రితో కలిసి కత్తి అత్తింటి వారిపై దాడి చేయడంతో భార్య, అత్త ఘటనా స్థలంలోనే చనిపోయారు. మామ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు కర్నూలు డిఎస్‌పి కెవి మహేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News