Monday, December 23, 2024

టాలెంటెడ్ వ‌రుడు.. లైవ్ పెయింటింగ్ తో.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఓ టాలెంటెడ్ వ‌రుడు లైవ్ పెయింటింగ్‌ వేసి వ‌ధువుకి స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. త‌మ పెళ్లి వేడుక‌లో వ‌రుడు వ‌ధువు లైవ్ పెయింటింగ్‌ను వేసి ఆమెను ఆశ్చ‌ర్యానికి లోను చేసిన వీడియో తాజాగా నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది.
ఈ వైర‌ల్ వీడియోను వ‌రుణ్ జ‌ర్స‌నియ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో వ‌రుణ్ కాన్వాస్‌పై పెయింట్ వేస్తూ ఉండ‌గా వ‌ధువు ప్ర‌థా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో చూస్తుండ‌టం క‌నిపించింది. మెల్లిగా మాస్ట‌ర్‌పీస్ రూపుదాల్చ‌గా ప్ర‌ధా పెయింటింగ్ పూర్త‌వుతుంది.

తొలుత త‌ల‌కిందులుగా పెయింట్ చేసిన వ‌రుణ్ చివ‌ర‌కు కాన్వాస్‌ను రివ‌ర్స్ చేయ‌డంతో న‌వ వ‌ధువు పెయింటింగ్ లైవ్‌లీగా అంద‌రి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. పెయింటింగ్‌ను చూసిన ప్ర‌థా భావోద్వేగానికి గుర‌వుతుంది. వ‌ధువు కోసం పెండ్లి కొడుకు డ్యాన్స్ చేయ‌డం చాలా కామ‌న్‌..ఇక్క‌డ చాలా భిన్నంగా చూస్తారు. నా వ‌ధువు ప్ర‌స్తుతం నా భార్యం కోసం ప్రేమ‌తో..అంటూ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News