Monday, March 31, 2025

కట్నం డిమాండ్…. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు

- Advertisement -
- Advertisement -

లక్నో: వివాహ వేడుక జరుగుతుండగా వరుడు కట్నం డిమాండ్ చేయడంతో అతడి చెట్టుకు కట్టేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రతాప్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమర్ జీత్ వర్మ అనే యువకుడు ఓ యువతిని పెళ్లి చేసుకుంటున్నారు. అమర్ జీత్ స్నేహితులు వధువు తరపు బంధువులతో అసభ్యంగా ప్రవర్తించారు. వరుడు, వధువు కుటుంబాలు, బంధువుల మధ్య గొడవ జరిగాయి. అదే సమయంలో వరుడు తనకు కట్నం కావాలని డిమాండ్ చేయడంతో అతడిని వధువు బంధువులు చెట్టుకు కట్టేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వరుడిని విడిపించి ఇరు వైపులా కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాము పెట్టిన ఖర్చులను ఇవ్వాలని వధువు తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మహారాష్ట్రలో పొత్తు పెట్టుకోం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News