- Advertisement -
హాజీపూర్‌ః ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్న వధువుకు వరుడు తాళి కట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చెన్నూర్ మండలం లంబాడిపల్లి కి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లికి చెందిన తిరుపతికి గురువారం వివాహం జరుగాల్సి ఉంది.
అయితే బుధవారం వధువు అస్వస్థతకు గురికావడంతో వెంటనే మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో పెళ్ళి వాయిదా పడవద్దని వరుడు ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వధువుకు తాళికట్టి భార్యగా చేసుకున్నాడు.
- Advertisement -