Friday, December 20, 2024

పాపం పెళ్లికొడుకు…పెళ్లికోసం 28 కిలోమీటర్లు నడిచాడు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు..డ్రైవర్ల సమ్మె కారణంగా వరుడితోపాటు అతని బంధువులు పెళ్లి మండపానికి చేరుకోవడానికి 28 కిలోమీటర్లు కాలికి పనిచెప్పాల్సి వచ్చింది. ఒడిషాలోని రాయగడ జిల్లా కల్యాన్‌సింగ్‌పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయత్‌కు చెందిన 22 ఏళ్ల నరేష్ ప్రస్కకు డిబలపాడు గ్రామానికి చెందిన వధువుతో శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కమర్షియల్ డ్రైవర్లు సమ్మె మొదలుపెట్టడంతో మగపెళ్లివారికి వాహనాలు లభించలేదు. దీంతో తమ గ్రామం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడపెళ్లివారింటికి నడకయాత్ర మొదలుపెట్టారు. నరేష్‌తోపాటు ఆడ, మగ బంధువులంతా నడకదారి పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

శుక్రవారం ఉదయం పెళ్లి ముహూర్తమనగా గురువారం రాత్రంతా నడిచి వారు ఆడపెళ్లివారింటికి చేరుకున్నారు. పెళ్లి చూసుకుని వధువు ఇంట్లోనే ఉండిపోతామని, డ్రైవర్ల సమ్మె ముగిసిన తర్వాత మ ఊరికి వెళతామని నరేష్ బంధువులు చెబుతున్నారు. అయితే పెళ్లయిన వేళా విశేషమేమో కాని ప్రభుత్వం ఇచ్చిన హామీకి సంతృప్తి చెందిన డ్రైవర్లు తమ సమ్మెను శుక్రవారం నాడే ఉపసంహరించారు. దీంతో ఆడపెళ్లివారు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఇక మగపెళ్లివారు తమ ఇళ్లకు నిక్షేపంగా వాహనాలలోనే వెళ్లవచ్చు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News