Thursday, January 23, 2025

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి క్లియరెన్స్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: చాలా కాలంగా వాయిదాపడుతూ వచ్చిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి క్లియరెన్స్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 12 విశాకపట్నంకు వచ్చి శంకుస్థాపన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. అయితే మోడీ పర్యటనలో దానిని ప్రధానమంత్రి కార్యాలయం చేర్చలేదని అధికార వర్గాలు తెలిపాయి.
విశాఖపట్నానికి ఈశాన్యంగా 40కిమీ. దూరంలో ఉన్న భోగాపురంలో పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యం పద్ధతిలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర విభజన తర్వాత 2014లో యోచించారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం భారత వాయుసేనకు చెందినది. ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రణాళికలోని అన్నింటిని పక్కనపెట్టేసి అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్క దానినే అభివృద్ధి చేయబోతున్నారు. అంతర్జాతీయ విమానశ్రయం డిజైనింగ్, బిల్డింగ్, ఫైనాన్సింగ్, నిర్మాణం, అభివృద్ధి, 40 ఏళ్ల పాటు విమానాశ్రయం గ్రీన్‌ఫీల్డ్ ఆపరేటింగ్ అండ్ మెయిన్‌టెయినింగ్‌కు రూ. 3000 కోట్లు కాగలదని జిఎంఆర్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News