Friday, November 15, 2024

భూగర్భ జలాలపై అవగాహన సదస్సు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: బీబీపేట్ మండల కేంద్రంలోని స్థానిక పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో రిలయన్స్ ఫౌండేషన్ భూగర్భ జలాల శాఖ ఆద్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సాగు నీరు, తాగు నీటి వినియోగం, నీటి వృదా నీటి సంరక్షణ లాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా జడ్పి వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, ఎంపిపి పసులాది బాలమని హాజరయ్యారు. మండల కేంద్రంలోని వివిద గ్రామాలలో భూగర్భ జలాల సామర్థత వాటి పరిణామాలను అంచనా వేసి ప్రజలకు వివరించారు. చెక్ డ్యామ్ ల ద్వారా పంట పొలాలకు అవసరపడే ఆదా చేసుకోవచ్చని జడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ అన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని నీటికి కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసీ రవి, భూగర్భ జల శాఖ అధికారి సతీష్, రైతుబంధు అద్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, ఏబిఎన్ పవన్, ఐకేపి సిబ్బంది రైతులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News