Thursday, December 19, 2024

దేశంలో అత్యధిక భూగర్బ జలాలు తెలంగాణలోనే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో  చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ తో పాటు ఉత్తారాది రాష్ట్రాలలో వర్షాలు వణికిస్తున్నాయి. గత మూడు నెలలుగా నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నదులు, డ్యాములు, రిజర్వాయర్లు నిండిపోయాయి. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో  భూగర్భ జలాలు భారీగానే పెరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధిక వర్షపాతం ,భూగర్భ జలాలు భారీగా పెరిగిన   రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.  ఉత్తర తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. నాగాలండ్ లో 2.7, హిమచల్ ప్రదేశ్ లో 6.0,ఉత్తరాఖాండ్ లో 12.1,గుజరాత్ లో 14.6, తెలంగాణలో మాత్రం 68.3 వర్షపాతం నమోదు అయ్యింది. బిహార్ లో అతి తక్కువ -77.0 వర్షపాతం నమోదు అయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News