Sunday, December 22, 2024

గ్రూప్-1 పరీక్షల వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు

- Advertisement -
- Advertisement -

త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రూప్-1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొన్ని నిబంధనల వల్ల టిఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారని రేవంత్ అన్నారు. 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. జీరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం కాదనీ, ఆయన ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క తప్పు కూడా రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News