Monday, January 20, 2025

అశోక్‌నగర్‌లో ఆగని ఆందోళనలు

- Advertisement -
- Advertisement -

చలో గాంధీభవన్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో
నిరుద్యోగుల అరెస్టులు ఇందిరాపార్కు వరకూ భారీగా పోలీసుల
మోహరింపు ఇప్పటికైనా చర్చలు జరపండి : నిరుద్యోగులు

మన తెలంగాణ/విద్యానగర్ : గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయడంతో పాటు ప్రిలిమ్స్‌లో తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలకు అదనపు మా ర్కులు కలపాలని, జి.ఓ నెంబర్ 29 రద్దు చే యాలని కోరుతూ నిరుద్యోగులు మళ్ళీ ఆందోళనకు దిగారు. వారం రోజుల నుంచి సాగుతున్న నిరసనలకు కొనసాగింపుగా ఆదివారం మ ధ్యాహ్నం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అశోక్ నగ ర్ చౌరస్తాకు చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కేవలం ప్రెస్‌మీట్ నిర్వహించి వెళ్ళిపోతామని అభ్యర్థులు విజ్ఞప్తి చేసినా పోలీసుల అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు.దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ని నాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఉస్మాని యా యూనివర్సిటీకి చెందిన పలు విద్యార్థి సం ఘాల ప్రతినిధులు సైతం నిరుద్యోగుల నిరసనలకు మద్దతుగా వచ్చారు.

గ్రూప్ 1మెయిన్స్ ప రీక్షలు వాయిదా వేయాలని, జీవో 29 ని రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై బైటాయిస్తున్న అభ్యర్థులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆగ్రహించిన నిరుద్యోగులు సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చలో గాంధీభవన్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. అశోక్ నగర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్క్ వైపు వెళ్ళడానికి ప్రయత్నించిన నిరుద్యోగులను బారికేడ్లతో నిలువరించి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసుల అరెస్టులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్ధేశం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఆందోళనలు చేస్తున్నామని, కనీసం చర్చలకు పిలువకపోవడం దారుణమన్నారు. గ్రూప్ 1 పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసి, జి ఓ నెంబరు 29 ని రద్దు చేయడంలో పాలకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు. పోలీసుల నిర్భందాలతో ఉద్యమాన్ని ఆపలేరని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల రాజ్యంగ రిజర్వేషన్లు కాపాడేలా జి.ఓ నెంబరు 55ను అమలు చేసేంతవరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. కాగా నిరసనలు చేస్తున్న ఓయూ జేఏసీ నేత మోతిలాల్ సహ వందలాది మందినీ పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

సిఎం రేవంత్ రెడ్డికి వినతి..

రాజకీయాలకు అతీతంగా చేస్తున్న ఆందోళనలను గుర్తించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు గ్రూప్స్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఒక వైపు నిరసనలు, మరో వైపు పోలీసుల ఒత్తిళ్ళ కారణంగా చదువులకు దూరమవుతున్న తమ మానసిక ఆవేదనను గుర్తించాలని కోరారు. చర్చలకు పిలిచి గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News