హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ హైకోర్టు రద్దు చేయడంతో అభ్యర్థులు ప్రగతి భవన్ వైపు దూసుకొచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగడానికి ప్రభుత్వం అలసత్వం కారణమని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్-1 పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. రెండు మూడు సంవత్సరాల నుంచి గ్రూప్-1 కోసం ప్రిపేర్ అవుతున్నామని, ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిఎస్ పిఎస్సీని రద్దు చేయాలని నిరసన తెలియజేస్తున్నారు. పరీక్షలు సరిగా నిర్వహించని ప్రభుత్వం ఎందుకు అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే పలు పరీక్షల పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు విరుచుకపడుతున్నారు.
Also Read: స్కిల్ స్కామ్ కేసు ఒక ఎగ్జాంపుల్: వైవి సుబ్బారెడ్డి