Thursday, January 23, 2025

గ్రూప్.1 పరీక్ష ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : జిల్లాలో టిఎస్ పిఎస్‌సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల ఆదివారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్ష గతంలో నిర్వహించగా పేపర్ లీకేజీ వల్ల రద్దైన విషయం తెలిసిందే. రెండో విడతగా మళ్ళీ ఆదివారం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా అయా ఈ పరీక్షకు మొత్తం అభ్యర్థులు 17365 మంది హాజర్ కావాల్సిఉండగా 10945 మంది (63.03శాతం) హాజరయ్యారు, మరో6420 మంది (36.97శాతం) గైర్హాజరు అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇక్కడ మొత్తం 8851 మంది అభ్యర్దులకు గాను 5258 మంది (59.38 శాతం) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

3593 మంది అభ్యర్ధులు గైర్హాజరయ్యారు. కేంద్రాలకు ఉదయం 10.15 గంటలలోపే అనుమతించారు. ఆ తరువాత వచ్చిన వారిని అనుమతించలేదు. రెండుచోట్ల తనిఖీ అనంతరం అభ్యర్థులను పరీక్ష హాల్ లోకి పంపించారు. ఈ సందర్బంగా పరీక్ష కేంద్రాలను కలెక్టర్ విపి.గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభు త్వ మహిళా కళాశాల, ఆర్జేసి డిగ్రీ కళాశాల, రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు. పరీక్ష నిర్వహణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

అధికారులకు సూచనలు చేశారు. అభ్యర్థులతో పాటు, ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది అందరిని తనిఖీలు చేయాలని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించవద్దని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ మధుసూధన్ కూడా పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటశిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్య నారా యణ, ఏసీపీ రామోజీ రమేష్, ప్రిన్సిపాళ్లు డా. జి. పద్మావతి, బి. అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

  • బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద అమలతున్న 144 సెక్షన్ నగరంలోని ఎస్‌బిఐటి ఇంజినీరింగ్ కాలేజ్, హార్వెస్ట్ స్కూల్, ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ కవిత డిగ్రీ కాలేజ్, ఎన్‌ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాల, నిర్మల హృదయ్ స్కూల్, ఎస్‌ఆర్ అండ్ బిజి ఎన్‌ఆర్ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారు. పోలీస్ కమిషనర్ వెంట ట్రైనీ ఏఎప్సీ అవినాశ్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌పి డా వినీత్ పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News