Friday, November 8, 2024

వాచీలు, హ్యాండ్‌బ్యాగ్స్, పర్సులకు అనుమతి లేదు: టిఎస్‌పిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాచీలు, హ్యాండ్‌బ్యాగ్స్, పర్సులకు అనుమతి లేదని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని కానీ షూ వేసుకోవద్దని సూచించింది. వెబ్‌సైట్‌లోని నమూనా ఒఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని సూచనలు చేసింది. పరీక్షల్లో బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు, శాశ్వత డిబార్ చేస్తామని టిఎస్‌పిఎస్‌సి హెచ్చరించింది.

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందని,  ఉదయం 8.30 నుంచి 10.15 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని వివరించింది.  ఉదయం 10.15 తర్వాత గేట్లు మూసివేత.. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల్లోని అనుమతి ఉండదని పేర్కొంది.  హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడీ చూపించాలని వివరించింది. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోతే.. కచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం.. మూడు ఫొటోలు ఉండాలని పేర్కొంది.

Also Read: రేపటి నుండి నూతన పోలీస్ స్టేషన్‌లో సేవలు ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News