Thursday, January 23, 2025

గ్రూప్ 1 పరీక్షకు భారీ బందోబస్త్

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్: జిల్లాలో ఆదివారం జరగబోయే గ్రూప్ 1 పరీక్షల కొరకు భారీబందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలలో 4857 మంది అభ్యర్థులకు ఆదివారం రోజున గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా భారీ ఎత్తున పోలీస్ అధికారులతో బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

దాదాపుగా 86 మంది పోలీస్ అధికారులతో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోని బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అభ్యర్థులకు ఏమైనా అవసరం ఉన్న పోలీస్ అధికారులకు లేదా డైల్ 100 కు గాని సంప్రదించవచ్చుని, బందోబస్త్ లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి తమకు ఇచ్చిన ఏరియాలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా గ్రూప్ 1 పరీక్షల బందోబస్త్ లో పాల్గొనాలని, ఏమైనా ఇబ్బందుకు ఉన్నట్లు అయితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలనీ, బందోబస్త్ విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా గ్రూప్ 1 పరీక్ష నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షకు హాజరై తమ కలలను సాకారం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News